ఎన్టీఆర్ సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్స్….!


2016ను జూనియర్ ఎన్టీఆర్ ఘనంగా ముగించాడు. నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ రూపంలో రెండు భారీ హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే మూడు వ‌రుస హిట్లు కొట్టి ఉండ‌డంతో ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమా కోసం చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో నిర్మించే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాలో పాత్రధారుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ సినిమా గురించి ఓ షాకింగ్ రూమ‌ర్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాలో కీల‌క‌మైన ఓ రోల్‌ను సీనియర్ నటీమణితో చేయించాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్. ఈ రోల్ కోసం శ్రీదేవిని అడుగుతున్నారనే రూమర్ వినిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు బాబీ ముంబై వెళ్లి ఓసారి శ్రీదేవిని కలిసి ఆ పాత్ర గురించి కూడా చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

అయితే ఈ పాత్ర చేసేందుకు శ్రీదేవి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిందా లేదా అన్న‌దానిపై మాత్రం క్లారిటీ లేదు. శ్రీదేవి రీ ఎంట్రీ తర్వాత దక్షిణాదిలో ఒకే ఒక సినిమా చేసింది. కోలీవుడ్ హీరో విజయ్ మూవీ పులిలో కీలక పాత్ర చేసినా.. ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్న ఈ మూవీలో శ్రీదేవి ఎన్టీఆర్‌కు అత్త పాత్ర‌లో న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ సినిమాలో శ్రీదేవి న‌టిస్తే సినిమా క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ఇదిలా ఉండగా ఐటం సాంగులే తప్ప హీరోయిన్స్ ఛాన్సులు తగ్గాయని వాపోతున్న హిరోయిన్ లక్ష్మి రాయి అయితే ఈ వయ్యారికి ఇలాంటిదే మరో ఛాన్స్ ఇస్తున్నాడట ఎన్టీఆర్ మరి ఈ ఇద్దరి భామలతో ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో చూడాలంటే సినిమ రిలీస్ అయ్యేవరకు ఆగాల్సిందే మరి…..!

కామెంట్‌లు