టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? బరిలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో ఏ హీరో అభిమానులు ఆ హీరో పేరు చెప్తారు. అయితే ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? అంటే అది కూడా సమాధానం లేని ప్రశ్నే. కానీ, ‘గూగుల్’ మాత్రం దీనికి సమాధానం ఇచ్చింది. టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే ‘బెస్ట్ డ్యాన్సర్’గా ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చింది. అంతేకాదు, ఆలిండియా టాప్ 10 డ్యాన్సర్ల జాబితాను కూడా ఇచ్చింది.
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 స్థానంలో ఉండగా, హృతిక్ రోషన్ రెండవ స్థానంలో, ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉండడంతో టాప్ 3లో ఇద్దరు టాలీవుడ్ హీరోలు నిలిచారు. అలాగే ఇండియన్ మైకేల్ జాక్సన్ గా భావించే ప్రభుదేవాకు 4, లారెన్స్ కు 5, మాధురి దీక్షిత్ కు 6, తమిళ హీరో విజయ్ కు 7, రాఘవ క్రోక్ రోజు కు 8, ఐశ్వర్యారాయ్ 9లో నిలువగా, 10వ స్థానంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. ఈ జాబితాపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నప్పటికీ, ‘గూగుల్’లో సెర్చ్ చేస్తే సమాధానం మాత్రం ఇదే వస్తోంది.
ఏది ఏమైతేనేం మన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ కు వెనక్కి నెట్టి ప్రధమ స్థానంలో నిలవడం విశేషం. బహుశా ఈ జాబితాను చూస్తే… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మిక్కిలి సంతోషిస్తారేమో..! ఉత్తరాది ఆధిపత్యాన్ని పక్కకు నెట్టి, గూగుల్ సెర్చ్ లో మన దక్షిణాది హీరోలు ఆధిపత్యం ప్రదర్శించడం పవన్ కే కాదు, దక్షిణాది సినీ పరిశ్రమకు కూడా శుభపరిణామమే కదా!

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి