తెలుగమ్మాయి అయినా అజంలి తెలుగులో కంటే తమిళ్‌లోనే ఎక్కువుగా పాపులర్ అయ్యింది. ఏ.ఆర్.మురుగదాస్ నిర్మించిన ‘జర్నీ’ అనే సినిమాతో అంజలి, జై జోడీ ఏ స్థాయిలో పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించిన ఈ జంట ప్రేమలో ఉన్నారని…వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని చాలాసార్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై అటు జై, ఇటు అంజలి ఎవ్వరూ స్పందించలేదు. అయితే ఇప్పుడు జైతో అంజలి అడ్డంగా బుక్ అయిపోయింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్నది నిజమేనని, ఇద్దరూ కలిసే ఉంటున్నారన్న వార్తలకు జై వేసిన ట్వీట్ చాలా బలం ఇస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం ఓ దోశ వేసి, ‘మీరూ మీకిష్టమైన వారికోసం ఒక దోశ చేయండి’ అంటూ దోశ చాలెంజ్ మొదలుపెట్టారు. ఇక హీరో జై కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొని, ఒక దేశ వేసి, హీరోయిన్ అంజలికి ఇచ్చారు. జై ఇలా దోశ వేశాడో లేదో ఆ వెంటనే అంజలికి అందించే ఫొటో కూడా పోస్ట్ చేశాడు.
దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉంటున్నారన్న వార్తలతో పాటు వీరు కలిసే ఉంటున్నారన్న గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. కోలీవుడ్ మీడియా కూడా వీరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని రకరకాలుగా వార్తలు ప్రచురిస్తోంది.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి