టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా లాంచ్ అయ్యింది. పవర్-సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తాడని…మూడు పాత్రలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు జై – లవ – కుశ అనే టైటిల్ పెడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక శుక్రవారం ప్రారంభమైన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్‌రామ్ స్వయంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్‌కు ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతితో పాటు తండ్రి హరికృష్ణతో పాటు మరో స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు.
ఆ గెస్ట్ ఎవరో కాదు..నందమూరి వారసుడు, ఎన్టీఆర్ తనయుడు అభయ్‌రామ్. తన ముద్దు ముద్దు మాటలతో తన తల్లిని ఆటపట్టిస్తూ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నందమూరి బుల్లి హీరో అభయ్ రామ్ నిలిచాడు. తన కుమారుడిని పబ్లిక్ ప్లేస్‌లకు తీసుకురాని ఎన్టీఆర్ ఈ సినిమా ఓపెనింగ్‌కు తీసుకువచ్చాడు.
ఇక ఈ సినిమా ఓపెనింగ్‌లో అభయ్‌రామ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. కొబ్బరికాయ కొట్టేందుకు ట్రై చేయగా… తాత హరికృష్ణ వచ్చి అభయ్‌కు సాయం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి