బ‌న్నీ ప‌రువు తీసేసిన దువ్వాడ జ‌గ‌న్నాథం


స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే టీజర్ వచ్చేసింది. సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే టీజ‌ర్‌కు కూడా మంచి టాక్ వ‌స్తోంది. అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బ‌న్నీకి మ‌ధ్య వైరం దెబ్బ‌కు ఈ టీజ‌ర్ తొలి గంట‌..తొలి ఐదు గంట‌లు ఇలా గంట గంట‌కు ఓ చెత్త రికార్డు క్రియేట్ చేసేస్తోంది. ఈ టీజ‌ర్ రిలీజ్ అయిన తొలి గంట‌లోనే రికార్డు స్థాయిలో డిస్లయిక్స్ రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
తొలి గంట‌కే 10 వేల డిజ్‌లైక్స్ వ‌చ్చాయి. ఇక ఐదు గంట‌ల‌కు 39000 లైక్స్ వస్తే.. 27000 డిస్లయిక్స్ వచ్చాయి. మొత్తంగా వచ్చిన రెండు ల‌క్ష‌ల వ్యూస్‌లో ఈ స్థాయిలో డిజ్‌లైక్స్ ఉండ‌డం టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు లేదు. అయితే ఈ డిజ్ లైక్స్ అన్నీ యాంటీ ఫ్యాన్స్ పనికట్టుకొని చేస్తున్నవని బ‌న్నీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
అటు ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా దువ్వాడ జ‌గ‌న్నాథం టీజ‌ర్‌కు డిజ్‌లైక్స్ కొట్టండి బ్ర‌ద‌ర్ అని ప‌నిగ‌ట్టుకుని సోష‌ల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక సినిమాలో బన్నీ చేసిన పాత్ర ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి కొందరు నచ్చక డిజ్ లైక్ చేస్తుంటే.. కొందరు మాత్రం చెప్పను బ్రదర్ అంటూ డిజ్ లైక్ ను కొట్టేస్తున్నారు. ఏదేమైనా ఓవ‌రాల్ టాక్ ప్రకారం ప‌వ‌న్ ఫ్యాన్స్ దెబ్బ‌కు బన్నీ డీజే టీజ‌ర్ తొలి రోజే చెత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకుంది.

కామెంట్‌లు