భావన కారులో ప్రయాణిస్తుండగా, వెనుకగా వచ్చి కారును గుద్దిన తర్వాత భావన కారులోకి ఎక్కిన దుండగులు దాదాపుగా గంటన్నర్ర పాటు వివిధ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ భావనను లైంగికంగా వేధింపులకు గురి చేసారన్న వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సదరు దుండగులు పలు అసభ్యకరమైన ఫోటోలను, వీడియోలను చిత్రీకరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కేసులో సరికొత్త విషయం వెలుగు చూసింది.
కారులో ఎక్కిన దుండగులు అసలు భావనపై లైంగిక వేధింపులకు గురిచేయలేదని, కేవలం బ్లాక్ మెయిల్ మాత్రమే చేసారని తాజాగా వెలువడుతున్న అంశం. ఓ షూటింగ్ లో భాగంగా భావన డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న వీడియోను చూపిస్తూ… డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లుగా సరికొత్త విషయం బయటకు వచ్చింది. దీనిని తీవ్ర అవమానంగా భావించిన భావన పోలీసులకు ఫిర్యాదు చేసిందని, సరైన సమాచారం లభించక, లైంగిక వేధింపులకు దిగినట్లుగా మీడియా ప్రచారం చేసిందని చెప్తున్న విషయాలలో అసలు వాస్తవం ఏంటన్నది త్వరలో తెలియనుంది.
ఏది ఏమైనా రోజుకొక మలుపు తిరుగుతున్న ఈ కేసులో భావనకు అండగా మాలీవుడ్ సినీ ప్రముఖులంతా నిలిచారు. ఆ మాటకు వస్తే ఒక్క మలయాళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే కాదు, బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, రితేష్ దేశ్ ముఖ్, జెనిలియా, అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ తదితరులు కూడా స్పందించారు. అలాగే టాలీవుడ్ నుండి సమంత, రవితేజలు కూడా స్పందిస్తూ భావనకు బాసటగా నిలిచారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి