NTR27 చరిత్రను తిరగరాసేలా ఉందే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ 2017 జైలవకుష పై బోలెడు అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే…ఇంకా షూటింగ్ కూడా మొదలుకానీ ఈ సినిమాపై ఇండస్ట్రీలో రికార్డు స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

దాంతో ఇప్పటినుండే దిమ్మతిరిగే ఆఫర్స్ ఎన్టీఆర్27 కి వస్తున్నాయంటూ ఇండస్ట్రీలో వార్తలు శిఖారు చేస్తున్నాయి…ఆ వార్తల ప్రకారం సినిమాకు నైజాం ఏరియాలో ఆల్ టైం రికార్డు లెవల్ లో 25 కోట్ల రేటు దక్కినట్లు చెబుతున్నారు…

ఇది నిజమైతే స్టార్ హీరోల్లో 25 కోట్ల ప్రీ రిలీజ్ ని నైజాంలో సొంతం చేసుకున్న తొలి హీరో ఎన్టీఆర్ అవుతాడు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఆగస్ట్ లో రిలీజ్ కి సిద్ధం కానుందని సమాచారం…ఎన్టీఆర్ ఇంతకుముందు ఎన్నడు చేయని విధంగా ఇందులో మూడు పాత్రలతో భీభత్సం సృష్టించబోతున్నాడు.

కామెంట్‌లు