ఎన్టీఆర్ వ‌ర్సెస్ ప‌వ‌న్ విన్న‌ర్ ఎవ‌రు..!


టాలీవుడ్‌లో సంక్రాంతి త‌ర్వాత మ‌రో బడా క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాదిలోనే మరోసారి నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలు టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బడా ఫైట్‌కు రెడీ అవుతున్నారట. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వ‌ర్సెస్ యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌రిగింది. వీరిలో చిరు త‌న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తోను, బాల‌య్య త‌న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో పోటీప‌డి ఇరువురు విజ‌యం సాధించారు.
ఇప్పుడు ఇదే క్ర‌మంలో మ‌రోసారి ఈ యేడాదే బాక్సాఫీస్ వ‌ద్ద ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ పోటీప‌డ‌నున్నారు. వీరిద్ద‌రి సినిమాలు ఒకేరోజు విడుదలకు ముస్తాబవుతున్నాయట. ఎన్టీఆర్, బాబి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘జై లవకుశ’ చిత్రం ఆగస్టు 11న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ముందుగానే చెప్పేశారు.
ఇక అదేరోజున పవన్, త్రివిక్రమ్ సినిమా కూడా రిలీజ్ కానుందట. పవన్ సినిమా కోసం ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న త్రివిక్రమ్.. త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్తాడట. ఒకే షెడ్యూల్‌లో కంటిన్యూగా షూటింగ్ పూర్తిచేసి ఆగస్టులో విడుదలకు ప్లాన్ చేస్తున్నారట. ఆగ‌స్టు 11 త‌ర్వాత వ‌రుస‌గా మూడు రోజుల వీకెండ్‌తో పాటు రెండు రోజులు సెల‌వులు రావ‌డంతో ప‌వ‌న్ సైతం అదే డేట్‌మీద క‌న్నేశాడ‌ట‌. మ‌రి ప‌వ‌న్ వ‌ర్సెస్ ఎన్టీఆర్ పోరులో ఎవ‌రిది పైచేయి అవుతుందో చూడాలి.

కామెంట్‌లు