ఎన్టీఆర్ జైల‌వ‌కుశ వ‌సూళ్ల టార్గెట్… ఫీజులు ఎగ‌రాల్సిందే


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చాలా త‌క్కువ వ‌య‌స్సులోనే స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ కేరీర్ ప‌రంగా ప్ర‌స్తుతం తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. టెంప‌ర్ – నాన్న‌కుప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్‌లాంటి హిట్ల‌తో ఉన్న ఎన్టీఆర్ బాబి డైరెక్ష‌న్‌లో త‌న కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాతో ఎన్టీఆర్ ఓ స‌రికొత్త టార్గెట్‌పై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ చివ‌రి చిత్రం జనతా గ్యారేజ్ 135 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. ఇక బాబి డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ న‌టించే సినిమాలో ఎన్టీఆర్ జై-ల‌వ‌-కుశ అనే మూడు క్యారెక్ట‌ర్ల‌లో న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
ఇక ఈ సినిమా కోసం ప్ర‌ముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ సీకే.ముర‌ళీధ‌ర‌న్‌తో పాటు హాలీవుడ్‌లో 30 ఏళ్ల ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న మేక‌ప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్వెల్‌ను కూడా తీసుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ తెలుగు, ఓవ‌ర్సీస్‌, త‌మిళ్‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో మొత్తం రూ.200 కోట్ల వ‌సూళ్ల‌పై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా కొత్త జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.
గ్యారేజ్‌తో మ‌ళ‌యాళ మార్కెట్‌పై క‌న్నేసిన ఎన్టీఆర్ ఇప్పుడు త‌మిళ్‌లో కూడా భారీ వ‌సూళ్లు సాధించేందుకు బాలీవుడ్‌, హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌తో ఈ సినిమాకు వ‌ర్క్ చేయిస్తున్నాడ‌ట‌. సినిమా స‌బ్జెక్ట్ అన్ని భాష‌ల్లోను క‌నెక్ట్ అయ్యేది కావ‌డంతో సౌత్‌లోని అన్ని భాష‌ల్లోను ఈ సినిమా ఒకేసారి గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌.

కామెంట్‌లు