జనతాగ్యారేజ్ మార్కెట్ వాల్యూ 300 కోట్లు

సౌత్ సినిమాలంటే మనకన్నా నార్త్ వాళ్లకు ఎక్కువ మోజు….ఇక్కడ ఏ సినిమా అయినా హిట్ అయితే పాపం వెంటనే అక్కడ నుండి రీమేక్ రాజులు ఆ సినిమా హక్కుల కోసం కొట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ గా ఈ కొట్టుకోవడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ విషయంలోను జరుగుతుంది.

ఎన్టీఆర్-మోహన్ లాల్ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ టోటల్ గా 85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి రచ్చ రచ్చ చేసింది. కాగా ఈ సినిమా కనుక బాలీవుడ్ లో రీమేక్ చేస్తే కచ్చితంగా 300 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉందని అక్కడి స్టార్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ అయిన కరణ్ జోహార్ అంటున్నాడట.

తన ప్రొడక్షన్ లో ఈ సినిమాను హృతిక్ రోషన్-అమితాబ్ ల కాంబోలో రీమేక్ చేయాలనే ఆలోచన కరణ్ జోహార్ కి ఉన్నట్లు ఇప్పుడు బీటౌన్ లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ మధ్య సరైన హిట్స్ లేక వెనకపడ్డ హృతిక్ కి ఈ స్టోరీ పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని కరణ్ అంటున్నట్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కామెంట్‌లు