అమ్మతోడు… పక్కాగా… అంటూ ఎన్టీఆర్ పై కామెంట్స్..!


వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న జూనియర్ ఎన్టీఆర్, తన తాజా చిత్రాన్ని ‘పవర్, సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రాల ఫేం బాబీ దర్శకత్వంలో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన అయిన నాటి నుండి, ఈ కధపై రకరకాల వార్తలు ప్రచారమయ్యాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఖచ్చితంగా మరో కలికితురాయి అవుతుందని, మునుపెన్నడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తారన్న టాక్ ఊపందుకుంది.

వీటికి మరింత బలాన్నిచ్చే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ సినిమా కధ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీ తన అనుభూతులను వెల్లడించగా, తాజాగా ఈ సినిమాకు పాటలను అందించనున్న రామజోగయ్య శాస్త్రి ‘యంగ్ టైగర్’ అభిమానులకు ఓ తీపికబురును అందించారు. “మ్యాటర్ ఏంటంటే… ఈ రోజు దర్శకుడు బాబీ వచ్చి కలిసారు. మళ్ళీ మా జూనియర్ ఎన్టీఆర్ – దేవిశ్రీప్రసాద్ తో… అద్దీ ఆనందం… మాంచి పాటలు ఉంటాయి… పక్కాగా… అమ్మతోడు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

రామజోగయ్య ఇంత నమ్మకంగా చెప్తున్నారంటే… ఈ సినిమా కధ ఏ రేంజ్ లో ఉందన్న విషయం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తను రాసే అన్ని చిత్రాల గురించి పెద్దగా సోషల్ మీడియాలో స్పందించని శాస్త్రి గారు, ఈ సినిమాపై తన అభిప్రాయం చెప్పారంటే… కధలో విషయం ఓ రేంజ్ లో ఉందని పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారు. దీంతో రోజులు గడిచే కొద్ది, ఈ సినిమాపై ‘యంగ్ టైగర్’ అభిమానుల అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా హల్చల్ చేస్తున్న సమాచారం మేరకు, ఈ సినిమాలో జూనియర్ పోషించబోయే మూడు పాత్రలలో ఒకటి క్రికెటర్ అన్న టాక్ హల్చల్ చేస్తోంది.

కామెంట్‌లు