తమిళ మార్కెట్‌ని టార్గెట్ చేసి హీరోలుగా రేంజ్ పెంచుకోవడానికి స్టార్ హీరోలు పోటీలు పడుతోంటే నాని మాత్రం ఇక తమిళ చిత్రాల జోలికి పోనని తేల్చేసాడు. గతంలో తమిళ చిత్రాలు చేయడానికి చేసుకున్న అడ్జస్ట్‌మెంట్ల వల్ల చాలా గ్యాప్ వచ్చిందని, బాగా స్లో అయిపోయానని, ఇకపై అలాంటివి జరగకుండా ఓన్లీ తెలుగు సినిమాల మీద, లోకల్ మార్కెట్ పైన కాన్సన్‌ట్రేట్ చేస్తున్నట్టు 'నేను లోకల్' హీరో చెప్పాడు.
తెలుగు సినిమాల మీదే దృష్టి పెట్టినప్పుడు తనకి డైవర్షన్స్ ఉండట్లేదని, ఒక కథని బాగా జడ్జి చేయగలుగుతున్నానని, అదే తెలుగు, తమిళం అంటూ రెండు పడవలపై కాళ్లు పెడితే ఎవరికి నచ్చేలా సినిమా వుండాలనే దానిపై ఆలోచనలు మారతాయని నాని వివరించాడు. నేను లోకల్ సినిమాపై నాని ఫుల్ కాన్ఫిడెంట్‌గా వున్నాడు. మాస్ క్యారెక్టర్ చేయడం వల్ల దీనికి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్నాడు.
ఈ సినిమాని తొలిరోజు ప్రేక్షకుల మధ్య కూర్చుని చూస్తానని, వాళ్ల స్పందన కోసం ఎక్సయిటెడ్‌గా చూస్తున్నానని చెప్పాడు. గత ఏడాది నుంచి చేసే సినిమాల వేగం బాగా పెంచిన నాని ఇకపై కూడా అదే స్పీడు కొనసాగించాలని అనుకుంటున్నానని, తన సినిమాలతో బయ్యర్లంతా హ్యాపీగా వుంటే తనకి చాలని, అలాంటి విజయాల కోసమే తపిస్తున్నానని చెప్పాడు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి