దగ్గుపాటి వారి వారసుడు దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజీ సినిమాకు మాంచి రెస్పాన్స్ వస్తోంది. ఒకవైపు ఓంనమో వెంకటేశాయ, మరోవైపు సింగం-3 సినిమాలున్నా ఘాజీ ఓపెనింగ్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండడంతో పాటు ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఘాజీ మరి ఎక్కువ కాకపోయినా ఫస్ట్ డే ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టింది.
సోలోగా ఇవి రానా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. ఘాజీ నైజాంలో తొలి రోజు రూ.50లక్షల షేర్ ను సాధించింది. బాహుబలి తర్వాత నైజాంలో రానాకు ఇదే అతిపెద్ద ఓపెనింగ్. నైజాం తర్వాత ఉత్తరాంధ్రలో అత్యధికంగా తొలిరోజు రూ. 18 లక్షల షేర్ వసూలు చేసింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి తొలి రోజు రూ.1.21 కోట్లను వసూలు చేసింది.
నైజాం – 50 లక్షలు
సీడెడ్ – 10 లక్షలు
నెల్లూరు – 4.5 లక్షలు
గుంటూరు – 12.75 లక్షలు
కృష్ణ – 13.26 లక్షలు
వెస్ట్ – 5.05 లక్షలు
ఈస్ట్ – 8 లక్షలు
ఉత్తరాంధ్ర – 18 లక్షలు
—————————————
ఏపీ+తెలంగాణ = 1.12 కోట్లు
—————————————-
సినిమాకు రెండో రోజు నుంచి కలెక్షన్లు మరింత బాగుండడం, ఈ శని, ఆది వారాల్లో అన్ని అర్బన్ సెంటర్లు, మల్టీ ఫ్లెక్స్ లు ఫుల్ అయిపోయాయి. మల్టీ ఫ్లెక్స్ లు షోలు పెంచాయి. అందువల్ల శని, ఆదివారాల కలెక్షన్లు బాగా వుండే అవకాశం వుంది. ఇక ఫస్ట్ డే తమిళ్, హిందీ కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి