యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టేశాడు. ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకొని వస్తున్న ఎన్టీఆర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకు నామమాత్రంగా పని చేసిన డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను తారక్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. మరోవైపు ఈ సినిమాకోసం తారక్ తన లుక్‌ను టోటల్‌గా మార్చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ విషయంపై టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది. ఈ వార్త వింటే.. తారక్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం చాలా హ్యీపీగా ఫీలవుతారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో తెలియాలంటే.. అసలు విషయంలోకి వెళ్లాల్సిందే!
తమిళ ఇండస్ట్రీలో అతి చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగి.. ధనుష్ ‘3’ సినిమాలోని ‘‘వై దిస్ కొలవెరి..’ అనే పాటతో యావత్ ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం తెలుగులో తన మొదటి సినిమాను చేయనున్న అనిరుధ్, ఇప్పుడు తన రెండో సినిమాగా తారక్ బాబీ సినిమా చేయనున్నాడు. ఈ విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయాల్సి ఉంది.
అయితే అనిరుధ్ ఈ చిత్రానికి ఫిక్సయ్యాడంటూ టాలీవుడ్‌లో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. తారక్ సినిమాకు అనిరుధ్ అందించే ట్యూన్స్ యూత్‌ను కట్టిపడిస్తాయనడం లో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి