ఎన్టీఆర్-బాలయ్య కలిసి నటిస్తే చూడాలని ఉందట
కాగా ఈ సినిమాల గురించి తెలుసుకున్న సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్టీఆర్-బాలయ్యలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్-బాలయ్య ఇద్దరు తనకు తెలుసునని వీరి కలయికలో ఒక సినిమా వస్తే చాలా బాగుంటుందని ఆ రోజు కోసం నేను కూడా ఎదురుచూస్తున్నానని మోహన్ లాల్ చెబుతున్నాడు.
ఇది ఒక్క మోహన్ లాల్ కోరిక మాత్రమే కాదు యావత్ నందమూరి అభిమానుల కోరిక కూడా…కానీ ఎన్టీఆర్ బాలయ్యల నడుమ ఎదో జరిగిందని అందువల్లనే వాళ్ళు ఒకరి నుండి ఒకరు దూరంగా ఉంటున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కలయికలో సినిమా వస్తే మాత్రం అది ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు.

