7, ఆగస్టు 2016, ఆదివారం

ఎన్టీఆర్-బాలయ్య కలిసి నటిస్తే చూడాలని ఉందట

నందమూరి హీరోల్లో ఫుల్ ఫాంలో జోరు మీడున్నారు ఎన్టీఆర్-బాలయ్య మరియు కళ్యాణ్ రామ్ లు. కళ్యాణ్ రామ్ కి పూరీ సినిమా రిలీజ్ అయ్యాక క్రేజ్ పెరుగుతుంది అని చెప్పొచ్చు కానీ ఎన్టీఆర్-బాలయ్య నటిస్తున్న క్రేజీ సినిమాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.


కాగా ఈ సినిమాల గురించి తెలుసుకున్న సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్టీఆర్-బాలయ్యలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్-బాలయ్య ఇద్దరు తనకు తెలుసునని వీరి కలయికలో ఒక సినిమా వస్తే చాలా బాగుంటుందని ఆ రోజు కోసం నేను కూడా ఎదురుచూస్తున్నానని మోహన్ లాల్ చెబుతున్నాడు.

ఇది ఒక్క మోహన్ లాల్ కోరిక మాత్రమే కాదు యావత్ నందమూరి అభిమానుల కోరిక కూడా…కానీ ఎన్టీఆర్ బాలయ్యల నడుమ ఎదో జరిగిందని అందువల్లనే వాళ్ళు ఒకరి నుండి ఒకరు దూరంగా ఉంటున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కలయికలో సినిమా వస్తే మాత్రం అది ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు.




లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్