ఎయిర్‌టెల్1199 ఆఫర్ : టెలికాంను వణికిస్తున్న జియో4
రిలయెన్స్ జియో.. భారత టెలికాం మార్కెట్ లో సరికొత్త అధ్యాయం అని సగర్వంగా ప్రకటిస్తునారు రిలయెన్స్ అధినేత అంబానీ. ‘జియో’తో టెలికాం కొత్త అర్ధం చెబుతామని, అసలుసిసలైన ఇంటర్ నెట్ ఎలా వుటుందో జియో చూపిస్తామని ఇప్పటికే ప్రకటనలు వెలువరిస్తునారు. ఇప్పుడు జియో టెర్రర్ మిగతా టెలికాం సంస్థలకు పట్టుకుందనే మాట వాస్తవం. జియోతో పోటీని ఎదుర్కోవడానికి ఇప్పుడు మితగా నెట్ వర్క్స్ కూడా సరసమైన ఆఫర్స్ తో వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి.
ఇందులో బాగంగా ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు రూ. 1,199కి ఒక నెలలో అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో లోకల్ కాల్స్‌తో పాటుగా ఎస్టిడీ, రోమింగ్ కాల్స్, ఎస్సెమ్మెస్, డేటా ప్లాన్‌లు కూడా ఉన్నాయి. త్వరలో రిలయెన్స్ జియో మార్కెట్‌లోకి ప్రవేసిస్తున్న్న నేపధ్యంలో పోటీని తట్టుకునేలా ఈ ఆఫర్ వినియోగదారుల ముందుచింది ఎయిర్‌టెల్.
లేబుళ్లు: Airtel vs Reliance jio


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్