3, ఆగస్టు 2016, బుధవారం

ఇండస్ట్రీ రికార్డ్ : ఎన్టీఆర్ దే





2016 టాలీవుడ్ క్యాలెండర్ లో సగం గడిచిపోయింది. ఈ సగంలో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని నిరాశ పరిచితే, మరికొన్నిఅలరించాయి. అయితే యాడాదికి రికార్డ్ సెట్ చేసే చిత్రం ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో. ఇక ఊపురి, సోగ్గాడే , అ ఆ.. క్లాస్ విజయాన్ని అందుకున్నాయి. అయితే పెద్ద సినిమాలనుకున్న బ్రహ్మోత్సవం , సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. 2016కి ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేస్తాయి అనుకున్న ఈ రెండు చిత్రాలు పల్టీ కొట్టాయి.

అయితే ఇప్పుడు 2016 రికార్డ్ ను తన ఖాతాలో వేసుకొనే ఛాన్స్ ఎన్టీఆర్ కి వుంది. జనతా గ్యారేజ్ గనుక హిట్ అయితే ఈ యాడాది ఇండస్ట్రీ రికార్డ్ ఎన్టీఆర్ దే అని చెప్పొచ్చు. ఎలా అంటే .. ఈ యాడాది సినిమాల్లో ‘జనతా గ్యారేజ్’కు ఆ స్టామినా వుంది.

క్రేజ్: ఎన్టీఆర్ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ క్రేజ్ మధ్య వస్తున్న చిత్రమిది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో సూపర్ ఫాం లోకి వచ్చాడు ఎన్టీఆర్. రెండు హిట్లతో ఫుల్ క్రేజ్ లో వున్నాడు దర్శకుడు కొరటాల. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా పై సహజంగానే బోలెడు అంచనాలు వున్నాయి.

ఓవర్శిస్ మార్కెట్: ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ఓవర్శిస్ లో తన సత్తా చాటాడు ఎన్టీఆర్. కొరటాలకు కూడా ఓవర్సీస్ లో మంచి ఫాలోయింగ్ వుంది. ఈ రకంగా ‘జనతా గ్యారేజ్’కు అక్కడ తిరుగులేదు.

మోహన్ లాల్: ఈ సినిమా మల్టీ స్టారర్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో చాలా ప్రాధన్యం వున్న పాత్రది. ఇంకోరకంగా చెప్పాలంటే మలయాళంలో ఇది మోహన్ లాల్ మూవీ. ఆయన పైనే ఫస్ట్ లుక్ , టీజర్ వదిలారక్కడ. తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఓకెసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సో.. ‘జనతా గ్యారేజ్’కు మలయాళ మార్కెట్ కూడా కలిసోస్తుంది.

ఇక తెలుగు మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. టాలీవుడ్ బాక్సాఫీసు బాద్షాలలో ఎన్టీఆర్ ఒకరు.

ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్ పడి చాలా కాలమైయింది. ఇప్పుడు జనతా గ్యారేజ్ తో ఆ హిట్ సొంతం చేసుకొనే అవకాశం వుంది. ఇప్పటివరకూ ఈ సినిమా పై చాలా పాజిటివ్ బజ్ వుంది. మరి ఫైనల్ రిజల్ట్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.


Popular Posts:-

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్