3, ఆగస్టు 2016, బుధవారం

గౌతమిపుత్ర.. న్యూ షెడ్యూల్ డిటేల్స్ !



క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాలయ్య వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇప్పటికే మొరాకో, జార్జియాలోనూ షూటింగ్ పూర్తి చేశారు. ఇక ఈ నెల 8వ తేదీన దర్శకుడు క్రిష్ వివాహ వేడుక ఉండటం వలన, షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. క్రిష్ వివాహ వేడుక అనంత‌రం ఈ నెల 20 నుంచి తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ తర్వాత ఈ మూవీ టీమ్ మధ్యప్రదేశ్ వెళ్లనుంది. సెప్టెంబర్ 1వ మధ్యప్రదేష్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీంతో.. గౌతమిపుత్ర.. మేజర్ పార్ట్ పూర్తయినట్టవుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. అన్నట్టు.. గౌతమిపుత్ర.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్