అతడే ఒక సైన్యం…!
టాలీవుడ్ లో ఇప్పుడున్న యంగ్ హీరోల్లో చక చక సినిమాలు చేస్తున్న హీరో ఎవరా అని అడిగితే అందరూ చెప్పే మాట ఒకటే యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఒక సినిమా సెట్ లో ఉండగానే మరో సినిమాని చేస్తున్నాడు. అతి చిన్నవయసులోనే 25 సినిమాలు చేసిన యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు తారక్. ప్రస్తుతం జనతాగ్యారేజ్ షూటింగ్ పార్ట్ ని శరవేగంగా కంప్లీట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తారక్ తో కలిసి నటించిన నిత్యామీనన్ తారక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. మొట్టమొదటి సారిగా నేను అంత ఖలేజా ఉన్న యాక్టర్ ని చూసానని అతడు ఒక సైన్యం లాంటివాడని చెప్తోంది ఈ అమ్మడు. మామూలుగా ఎవరైనా కెమెరా ముందుకొచ్చాకే తమ యాక్టింగ్ టాలెంట్ ని ప్రదర్శిస్తారని అయితే తారక్ మాత్రం కెమెరా వెనకాల కూడ అదే బాడీలాంగ్వేజ్ లో అదే మూడ్ లో ఉండేవాడని అలాంటి ఆర్టిస్ట్ ని నేను ఎక్కడా చూడలేదని చెప్తోంది. ఒక సీన్ లో ఆపకుండా అలాగే డైలాగ్స్ చెప్తున్నాడని తన వల్ల పొరపాటు జరిగి టేక్స్ తీసుకుంటున్నా కూడ తారక్ మాత్రం విసుక్కోకుండా యాక్టింగ్ చేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్తోందట. సెట్ లో ఎన్టీఆర్ ఉన్నంత సేపు చాల డిసిప్లైన్ గా ఉన్నామని, ఈ సినిమా నా కెరియర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని చెప్తోందిట నిత్యామీనన్. జనతాగ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్, సమంతలు హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కపాట మినహా ఇప్పుడు షూటింగ్ మొత్తం పూర్త అయ్యిందని, త్వరలోనే చిత్రయూనిట్ పాటకోసం చెన్నై వెళ్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అన్ని హంగులతో ఈ సినిమాని ఇండిపెండెంట్స్ డే కానుకగా ఆగష్ట్ 12వ తేదిన విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.
లేబుళ్లు: అతడే ఒక సైన్యo

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్