1, ఆగస్టు 2016, సోమవారం

బరిలోకి దిగిన యంగ్ టైగర్



బరిలోకి దిగిన యంగ్ టైగర్…!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆగష్ట్ నుండి తన జోరుని పెంచబోతున్నాడు.సినిమా సినిమాకి వైవిధ్యభరితమైన కాన్సెప్ట్స్ తో డైరెక్టర్స్ ఎంపికలో తన టాలెంట్ ని చూపిస్తున్నాడు.ప్రస్తుతం కొరటాల శివతో జనతాగ్యారేజ్ సినిమా పూర్తి కావొస్తున్న దశలో మరో సినిమాకి శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ఉన్నాడు.తన సినిమాలకి ఎప్పటినుంచో కథలను అందిస్తున్న వక్కంతం వంశీని డైరెక్టర్ గా చేస్తూ ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ సినిమా లాంఛనంగా ఆగష్ట్ 12వ తేదిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అంతేకాకుండా అదేనెలలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో మరో సినిమాని కూడ ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నట్లుగా చెబుతున్నారు ఫిలిం నగర్ వర్గాలు.

పూరీ జగనాధ్ సినిమాలో మళ్లీ పోలీస్ గెటప్ లో అదరగొట్టేందుకు రెడీ అయిపోతున్నాడట.ఇక జనతాగ్యారేజ్ టీమ్ తో మరో సినిమాని చేసేందుకు కూడ ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు తారక్.మళ్లీ కొరటాల శివతోనే సినిమా చేసేందుకు అది కూడ ఈ సంవత్సరమే ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అంతేకాకుండా ఇటీవలే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ చెప్పిన కథలను సైతం ఓకే చేసేసాడట జూనియర్.ఇక టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న స్టార్స్ అంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు లేనని చెబుతున్నారు ఫిలిం నగర్ వర్గాలు.ఇక యంగ్ టైగర్ బరిలోకి దిగాడని సంవత్సరానికి మూడు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడని చెప్తున్నారు విశ్లేషకులు.

Share this:


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్