సింగమలై అడుగుపెడితే కేరళ మొత్తం తరలివచ్చింది
13 ఏళ్ల క్రితం సింగమలైగా కేరళ గడ్డపై తొలిసారిగా అడుగుపెట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సినిమానే సింహాద్రి అని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సినిమా సృష్టించిన సునామీ ఎలాంటిదో కూడా చెప్పనవసరం లేదు.
మాస్ ని ఓ రేంజ్ లో ఊపేసిన ఆ సినిమా తరువాత మళ్ళీ 13 ఏళ్ళకి కేరళలో తన సినిమా షూటింగ్ కోసం వెళ్ళాడు యంగ్ టైగర్. కాగా అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోకపోయినా ఇప్పుడు జనతాగ్యారేజ్ టీసర్ తో కేరళ ఆడియన్స్ కి తెగ క్లోజ్ అయిన ఎన్టీఆర్ ని చూడటానికి క్యూలు కట్టారు అక్కడి అభిమానులు.
జనతాగ్యారేజ్ సాంగ్ అండ్ ఫైట్ సీన్ కోసం కేరళలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ అండ్ జనతాగ్యారేజ్ టీం ని చూడటానికి కలవడానికి అశేష అభిమానులను తండోపతండాలుగా వచ్చారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మోహన్ లాల్ అభిమానులు అందరూ ఎన్టీఆర్ ని చూసి ఫిదా అవుతున్నారని చెబుతున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో మరి చూడాలి.



0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్