2, ఆగస్టు 2016, మంగళవారం

మహేష్ హీరోయిన్ గా నమ్రత !


మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. మహేష్ వైఫ్ నమ్రత మళ్లీ తెరపై కనిపించనుంది. అది కూడా మహేష్ – మురగదాస్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమాలోనే కావడం విశేషం. మహేష్ ను పెళ్లి చేసుకున్న తర్వాత నమ్రత నటనకు గుడ్ బై చెప్పింది. ఇన్నేళ్ళలో మ‌ళ్లీ కెమెరా ముందుకు వచ్చింది లేదు. మహేష్ తాజా చిత్రంలో ఓ స్పెషల్ రోల్ ఉందట. ఆ పాత్రని నమ్రతతో చేయిస్తే బాగుంటుందని.. మహేష్ బాబుకి చెప్పగా.. నమ్రత ఓకే అంటే నాకు ఓకే అనేశాడట. నమ్రత మొదట కాస్త సంకోచించినా.. చివరికి ఓకే చెప్పినట్టు సమాచారమ్. అథితి పాత్రలో కాకుండా మహేష్ ప్రక్కన పూర్తి స్థాయి హీరోయిన్ గా అయితే ఇంకా బాగుండని ప్రిన్స్ ఫ్యాన్స్ గుసగుసలాడుకొంటున్నారు.

మురగదాస్ – మహేష్ ల చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. దర్శకుడు ఎస్ జె సూర్య మహేష్ కి విలన్ గా కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కున్న ఈ చిత్రం సామాజిక అంశాలని టచ్ చేస్తూ సాగుందట. ఇందులో మహేష్ సీఐడీ ఆఫీసర్ గా కనిపిస్తాడనే ప్రచారం కూడా సాగుతోంది.


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్