2, ఆగస్టు 2016, మంగళవారం

తారక్ పాటేసుకొన్నాడు..



ఇన్నాళ్లు ఫైటింగులూ, డైలాగులు చెప్పి చెప్పి విసిగిపోయిన తారక్ పాటేసుకొన్నాడు. అందమైన, ఆహ్లాదకరమైన కేరళ లొకేషన్స్ తో ముద్దుగుమ్మలతో కలిసి అదిరిపోయే స్టెప్పులను వేస్తున్నాడు. ఎన్టీఆర్ – కొరటాల శివల “జనతా గ్యారేజ్” కేరళ షెడ్యూల్ ప్రారంభమైంది. అక్కడ జూనియ‌ర్ ఎన్టీఆర్, స‌మంతా, నిత్యా మీన‌న్ ల‌పై పాట‌ల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. వాస్తవానికి ఫారిన్ లో పాటలని తెరకెక్కించాలని చిత్రబృందం డిసైడ్ అయ్యింది. అయితే, గ్యారేజ్ లో కీలక పాత్రలోనటిస్తున్న మోహన్ లాల్, ఉన్నిముకుందన్ సలహా మేరకు ఆ షెడ్యూల్ ని కేరళకి మార్చారు. కేర‌ళ‌లో షూటింగ్ ముగిసిన త‌ర్వాత హైద‌రాబాద్ లో కాజ‌ల్ తో ఒక ఐటెం సాంగ్ ను తీయ‌నున్నారు. దీంతో.. షూటింగ్ దాదాపు ముగిసినటే.



ఈ చిత్రానికి సంగీతం దేవీశ్రీ ప్ర‌సాద్. తారక్ కోసం అదిరిపోయే పాటలని ఇచ్చాడట. ఇక, ఐటమ్ స్పెషలిస్టయిన దేవీ గ్యారేజ్ ఐటమ్ సాంగ్ సూపర్భ్ గా కంపోజ్ చేసినట్టు చిత్రబృందం చెబుతోంది. అన్నట్టు.. జనతా గ్యారేజ్ సెప్టెంబ‌ర్ రెండో తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.




లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్