బడికి వెళ్తున్న విక్టరీ వెంకటేష్
బడి అంటే పుస్తకాల్లో పాఠాలు చెప్పే బడి కాదులెండి. ఇది బాక్సింగ్ లెసన్స్ నేర్పించే బడి. ‘బాబు బంగారం’ విడుదలకు ఏర్పాట్లు పూర్తయిపోవడం.. ఒక రోజు మీడియాను కలిసి ఇంటర్వ్యూలివ్వడం మినహాయిస్తే ఆ సినిమాకు సంబంధించి తన పనంతా అవగొట్టేయడంతో తన తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టేశాడు వెంకీ. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే తమిళ-హిందీ భాషల్లో విజయవంతమైన ‘సాలా ఖడూస్’ రీమేక్ లో నటించబోతున్నాడు వెంకీ. ఇది ఓ బాక్సింగ్ కోచ్ కథతో తెరకెక్కిన సినిమా అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమని ఒరిజినల్ హీరో మాధవన్ ఏడాది పైగా కష్టపడ్డాడు. తన లుక్ పూర్తిగా మార్చుకున్నాడు. అమెరికాలో శిక్షణ పొందాడు. మాధవన్ చూడ్డానికి బబ్లీగా కనిపిస్తాడు కాబట్టి అంత కష్టపడాల్సి వచ్చింది.
ఐతే వెంకీకి అంత అవసరం లేదు. మామూలుగానే విక్టరీ హీరో చాలా ఫిట్టుగా ఉంటాడు. కండలు తిరిగిన బాడీ ఆయనది. కాబట్టి నెలా రెండు నెలలు శ్రమిస్తే సరిపోతుంది. అందుకే ఓ పక్క వర్కవుట్లు చేస్తూనే.. ఇంకో పక్క బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు వెంకీ. ఓ బాక్సింగ్ ట్రైనర్ దగ్గర మెలకువలు నేర్చుకుంటూ పంచ్ లు విసరడం ప్రాక్టీస్ చేస్తున్నాడు వెంకీ. ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన తెలుగమ్మాయి సుధా కొంగరానే ఈ చిత్రాన్ని కూడా రూపొందిస్తోంది. సురేష్ ప్రొడక్షన్ సంస్థ.. మరో ప్రొడక్షన్ హౌజ్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘సాలా ఖడూస్’లో అద్భుత అభినయంతో ఆకట్టుకున్న రితికా సింగే తెలుగులోనూ వెంకీ శిష్యురాలిగా నటించనున్న సంగతి తెలిసిందే.
లేబుళ్లు: Venkatesh attends boxing classes


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్