6, ఆగస్టు 2016, శనివారం

సుకుమార్‌కి ప్రేమతో.. బీఎమ్‌డబ్ల్యూ.. ఇచ్చింది ఎవరో తెలుసా ?


ఇండస్ట్రీలో బాహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం చూస్తూనే వుంటాం. ఈ మధ్య ఈ అభిమాన, ఆప్యాయతలు ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీమంతుడు విజయం తర్వాత దర్శకుడు కొరటాల శివకి ఓ ఖరీరైదన కారు బహుమతిగా ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘భలే భలే’ విజయం అందించిన మారుతి కూడా ఓ ఖరీదైన కారును నిర్మాతల నుండి బహుమతిగా అందుకున్నాడు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ కూడా విలువైన కానుకను అందుకున్నారు.నిర్మాత బి.విఎస్.ఎన్ ప్రసాద్ , సుకుమార్ కి బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌త్రీ సీరిస్ కారును బహుమానంగా ఇచ్చారు.

బి.విఎస్.ఎన్ ప్రసాద్ , సుకుమార్ మధ్య మంచి అనుబంధం వుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య-2తో పాటు ఇటివల నాన్నకు ప్రేమతో చిత్రాలు బి.విఎస్.ఎన్ నిర్మాణంలోనే రూపుదిద్దుకున్నాయి. నాన్నకు ప్రేమతో అయితే మంచి విజయాన్ని సాధించింది. సుకుమార్ పై తనకున్న అభిమాన్ని, ప్రేమను వస్తు రూపంలో చాటాలనుకున్న బి.విఎస్.ఎన్.. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌త్రీ సీరిస్ కారును బహుమతిగా అందించారు.


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్