7, ఆగస్టు 2016, ఆదివారం

టివి ఛానల్స్ చుట్టూ తిరుగుతున్న చిరంజీవి



మెగాస్టార్ చిరంజీవి. మొన్ననే హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్లో షూటింగులో బిజీగా ఉన్నారు. తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న 150వ చిత్రంలో ఆయన బిజీగా ఉంటే.. ఇప్పుడు తెలుగు టివి ఛానల్స్ చుట్టూ తిరుగుతున్నారని న్యూస్ వస్తోంది ఏంటి? అసలు ఎందుకిలా? వాట్ హ్యాపెన్డ్ టు చిరంజీవి? 


సడన్ గా 05/08/2016 రోజు మధ్యాహ్నం టివి 5లో ప్రత్యక్షమయ్యారు మెగాస్టార్. కంగారుపడకండీ.. ఆయన లైవ్ లో ఏదన్నా ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి రాలేదు. కేవలం అక్కడ షూటింగ్ చేసుకోవడానికి వచ్చారు. ఈ సినిమాలో మీడియా సంస్థల ఆఫీసులకు వెళ్ళి డిమాండ్లు చేసే సీన్లు కొన్ని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మన తెలుగులో ఉన్న టాప్ ఛానల్స్ ఆఫీసుల్లో షూట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఒక ప్రముఖ ఛానల్ కు వెళ్ళిన చిరు.. మధ్యాహ్నం మరో ఛానల్ కు వచ్చారు. 


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్