7, ఆగస్టు 2016, ఆదివారం

ఇంతకీ యాంకర్ లాస్యకి ఏమైంది.. ?



కొద్దిరోజులుగా బుల్లి తెర యాంకర్ లాస్య పై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. రవి-లాస్య జోడి భలే కుదిరేది. ఇద్దరు కలసి బుల్లితెరపై హంగామా చేసేవారు. ఢీ జూనియర్స్ తర్వాత ఈ జోడీ కనబడటం మానేసింది. రవి అప్పుడప్పుడూ కనిపించినా లాస్య మాత్రం అస్సలు కనిపించడం లేదు. దీంతో.. లాస్సపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

రవి-లాస్యల మధ్య చెడిందని. ఇద్దరు గొడవపడ్డారని.. రవి యాంకర్ శ్రీముఖి సన్నిహితంగా ఉండటం నచ్చని లాస్యని రవిని నిలదీసిందని.. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరిగింది. ఓ వెబ్ సైట్ లో అయితే, ఏకంగా లాస్యకి ఆరోగ్యం బాగులేదని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతుందనే కథనాన్ని రాసేసింది. అయితే, ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది లాస్య.

కొన్నాళ్లుగా.. తనపై వస్తోన్న పుకార్లపై లాస్య స్పందించింది. తనపై వస్తోన్న వార్తలన్నీ పుకార్లేనని.. కావాలనే కొంత గ్యాప్ తీసుకున్నానని, ఈ గ్యాప్ లో కుటుంబ సభ్యులతో కలసి ఎంజాయ్ చేస్తున్నాను. త్వరలోనే ఓ కొత్త ప్రొగ్రామ్ తో మీ ముందుకొస్తానని ఓ వీడియో ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. దీంతో.. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో లాస్యపై జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడినట్టయ్యింది.


లేబుళ్లు: