జనతా గ్యారేజ్.. అప్పుడే 95546 డాలర్లు
`జనతా గ్యారేజ్` గ్యారేజ్ ప్రభంజనం మొదలైపోయింది. ఎన్టీఆర్ రికార్డుల వేట మొదలుపెట్టాడు. అమెరికాలో కొద్దిసేపటి క్రితమే జనతా గ్యారేజ్ ప్రీమియర్లు షురూ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగుల రూపంలోనే 95546 డాలర్లు వసూళ్లొచ్చాయని ఓవర్సీస్ రిపోర్ట్.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెనిఫిట్ షోలో మొదలయ్యాయి. ఈ బెనిఫిట్ షోల లెక్క ఇంకా తేలాల్సివుంది. ఎన్టీఆర్ కెరీర్ లో భారీ అంచనాల నడుమ వస్తున్న చిత్రమిది. రికార్డ్ లెవల్లో జనతా గ్యారేజ్ ప్రీ బిజినెస్ జరిగింది. ఇప్పుడు దాదాపు 80కోట్ల వసూళ్ళు లక్ష్యంగా పెట్టుకుంది జనతా గ్యారేజ్. ఈ టార్గెట్ ను ఖచ్చితంగా రీచ్ అవుతామని ధీమాగా చెబుతోంది జనతా గ్యారేజ్ టీమ్.
ఇప్పటివరకూ అందిన రిపోర్ట్స్ ప్రకారం.. సర్వాత్ర సినిమాపై పాజిటీవ్ టాక్ వుంది. మరి కొద్ది సేపట్లో ఈ సినిమా పూర్తి రివ్యూ మీముందుటుంది.
లేబుళ్లు: Janathaa Garage, US Premiers

