టాలీవుడ్ టాప్ ప్లేస్ కొట్టేసిన జనతాగ్యారేజ్
టాలీవుడ్ హిస్టరీలో కొత్త రికార్డుకు శ్రీకారం చుట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఏ పెద్ద హీరో నటించిన సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయిన తొలి రోజు 1 మిలియన్ మార్క్ ని దాటలేదు. కానీ ఎన్టీఆర్ ఈ మార్క్ ని అందుకుని కొత్త చరిత్ర సృష్టించాడు.
జనతాగ్యారేజ్ ట్రైలర్ విడుదల అయిన 20 గంటల్లోనే టాలీవుడ్ హిస్టరీలోనే మొదటిసారిగా 1 మిలియన్ మార్క్ ని అందుకుని కొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో పాత రికార్డుల బెండు కూడా తీసేసింది ఈ సినిమా. 20 గంటల్లో 1 మిలియన్ మార్క్ అందుకున్న జనతాగ్యారేజ్ ఇప్పటివరకు 32 వేల లైక్స్ ని సొంతం చేసుకుంది.
ఇది కూడా ఓ కొత్త రికార్డు అని చెప్పొచ్చు. ఈ మధ్యే టీసర్ రిలీజ్ సమయంలో సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అయిన టీసర్ 6 గంటల్లోనే 1 మిలియన్ మార్క్ ని అందుకుంది. కాగా ఇప్పుడు రాత్రి 10:30 కి రిలీజ్ అయిన ట్రైలర్ టీసర్ అంత ఫాస్ట్ గా రీచ్ కాకపోయినా మిగిలిన ట్రైలర్ లతో పోల్చితే ఫాస్టెస్ట్ 1 మిలియన్ మార్క్ అందుకున్న ట్రైలర్ గా నిలిచి ఎన్టీఆర్ ఖాతాలో మరో రికార్డుగా నిలిచింది.
లేబుళ్లు: NTR Fans dandayatra Continues in YouTube

