మెగా ‘బ్రదర్ ‘ గోల ఎక్కువయ్యింది.
మెగా ఫ్యామిలీ హీరోలకు, వారి అభిమానులకు అసలు పడడం లేదు.
సరైనోడు సక్సెస్ మీట్ తో మొదలయిన ఈ గొడవ నిన్నటి తిక్క వరకు కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటే..సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’ ఆడియో లాంచ్ లో అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి అరుస్తుంటే.. మిమ్మల్ని ఆపలేను బ్రదర్ అని వారిని ఉత్సాహ పరిచాడు. ఇది ఓ రకంగా అల్లు అర్జున్ కు కౌంటర్ వేసాడు అని సోషల్ మీడియా లో కామెంట్స్ వేసారు.
ఇక నిన్న రిలీజ్ అయినా తిక్క చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తిక్క కుదిరిందా బ్రదర్..అంటూ సాయి కి కౌంటర్ వేస్తున్నారు. ఇలా ఒకే ఫ్యామిలీ కి చెందిన హీరోల అభిమానులు పబ్లిక్ గా గొడవలు పడుతుంటే మిగతా హీరోల అభిమానులు నవ్వుకుంటున్నారు. మొత్తానికి మెగా ‘బ్రదర్ ‘ గోల ఎక్కువయ్యింది అంటూ కామెంట్స్ వేస్తున్నారు.
లేబుళ్లు: Mega brother's golla ekkavaindi

