7, సెప్టెంబర్ 2016, బుధవారం

ఇజంలో…. ఎన్టీఆర్‌??


ఇజంలో…. ఎన్టీఆర్‌??

 పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ఇజం. క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. పూరిపై న‌మ్మ‌కంతో ఈసినిమాపై కోట్లు ధార‌బోశాడు క‌ల్యాణ్ రామ్‌.క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. పూరిపై న‌మ్మ‌కంతో ఈసినిమాపై కోట్లు ధార‌బోశాడు క‌ల్యాణ్ రామ్‌. టీజ‌ర్‌తో బ‌జ్ కూడా వ‌చ్చింది. దాన్ని కాపాడుకోవ‌డానికి ఇప్పుడు ఎన్టీఆర్‌ని రంగంలోకి దించాల‌నుకొంటున్నాడు పూరి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఓ కామియో చేయించాల‌ని పూరి ఫిక్స‌య్యాడ‌ట‌. క‌ల్యాణ్ రామ్ – ఎన్టీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌పై జాయింటుగా ద‌ర్శ‌న‌మివ్వ‌లేదు. ఎన్టీఆర్ ఇజంలో క‌నిపిస్తే ఈ సినిమాకి భీక‌ర‌మైన మైలేజీ రావ‌డం ఖాయం. ఓ పాట‌లో ఎన్టీఆర్ క‌నిపిస్తే బాగుంటుంద‌న్న‌ది క‌ల్యాణ్‌రామ్‌, పూరిల ఆలోచ‌న‌. దానికి ఎన్టీఆర్ కూడా సై అన్నాడ‌ని టాక్‌. ఎన్టీఆర్ః – పూరి సినిమా మొద‌ల‌వ్వ‌డానికి ఇంకా టైమ్ ఉంది. కాబ‌ట్టి.. ఈలోగా ఎన్టీఆర్ ఖాళీనే. అందుకే అన్న‌య్య కోసం కెమెరా ముందుకు రావ‌డానికి ఎన్టీఆర్ సిద్ద‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ పాట‌కు స్కోప్ లేక‌పోయినా.. వాయిస్ ఓవ‌ర్‌తోనో, గెస్ట్ అప్పీరియ‌న్స్‌తోనూ ఎన్టీఆర్‌ని వాడుకోవాల‌ని చూస్తున్నాడు పూరి. అన్నీ ఒకే అయితే… ఇజంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఖాయం.
 
You May Also see
loading...

లేబుళ్లు: