4, ఆగస్టు 2016, గురువారం

చందమామని చూస్తే చంద్రముఖి గుర్తొస్తోందే



టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు లక్కీ ఛాన్సులు తగిలేస్తుండడంతో మంచి జోష్ లో ఉంది. తమిళ్ లో అజిత్ తో మూవీ.. తెలుగులో మెగాస్టార్ సరసన ఛాన్స్.. ఈ రెండు ఆఫర్లు అమ్మడిని మళ్లీ వార్తల్లోకి తీసుకొచ్చేశాయి. ఒకవైపు క్రేజ్ తగ్గిందని అనుకునే టైమ్ లో.. ఇలాంటి ఆఫర్స్ కచ్చితంగా ఉత్సాహాన్ని ఇచ్చేవే. 

తన సంతోషాన్ని పంచుకోవడం కోసమో.. లేక ఆ మొబైల్ కంపెనీని ప్రమోట్ చేయడం కోసమో అర్ధం కాకుండా.. ఓ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఇచ్చిన పోజును కాజల్ పోస్ట్ చేసింది. అది సెల్ఫీ తీసుకోవడం కాదని.. ఫోటోకి ఇచ్చిన పోజే అని అమ్మడి కంటి చూపు చూస్తే అర్ధమైపోతోంది. అలా ఏదో పసిగట్టేందుకు కళ్ల వైపు చూసిన జనాలు గభాలున దడుసుకుంటున్నారు. కను రెప్పలపై రెడ్ కలర్ లైనింగ్స్ వేసి.. కన్ను చుట్టూ అదే షేడ్ తో డిఫరెంట్ గా మేకప్ వేసుకుని కనిపించింది కాజల్.

గబుక్కున ఈ ఫోటో చూడగానే చందమామ కాకుండా చంద్రముఖి అనుకున్నా ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే.. ఈ ఫోటోని ఇప్పుడు షేర్ చేసింది కానీ.. అమ్మడి అవతారం చూసిన జనాలు.. ఇది లేటెస్ట్ గా తీసిన ఫోటో కాదని గుసగసా చెప్పేసుంటున్నారు. 


లేబుళ్లు: