5, సెప్టెంబర్ 2016, సోమవారం

టాలీవుడ్ రికార్డును తిర‌గ‌రాసిన ఎన్టీఆర్‌



యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌ నైజాంలో గ‌తంలో ఏ హీరోకి లేని ఓ కొత్త రికార్డ్ సాధించాడు. నైజాంలో రూ.10 కోట్ల షేర్ రాబ‌ట్టిన సినిమాల్లో ఎన్టీఆర్ మూడో చిత్రంగా గ్యారేజ్ రికార్డుల‌కు ఎక్క‌నుంది. మ‌రో విశేషం ఏంటంటే తార‌క్ న‌టించిన మూడు వ‌రుస సినిమాలు అక్క‌డ ఈ మార్క్‌ను క్రాస్ చేశాయి. ఎన్టీఆర్ గ్యారేజ్ నైజాంలో తొలిరోజే.. 5.5 కోట్ల షేర్ సాధించింది. రెండు రోజుల్లో అది రూ. 9 కోట్ల‌ను రీచ్ అవ్వ‌గా…మూడో రోజుకు అది రూ.10 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసేసింది.

ఎన్టీఆర్ చివ‌రి రెండు సినిమాలు టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమతో కూడా నైజాంలో ప‌ది కోట్ల షేర్ పొందాయి. ఇలా, వ‌ర‌స‌గా మూడు సినిమాలు నైజాంలో ప‌దికోట్ల‌కుపైగా షేర్ పొంద‌డం రికార్డుగా నిలిచింది. ఇక ఓవ‌ర్సీస్‌లో సైతం ఎన్టీఆర్ న‌టించిన మూడు వ‌రుస సినిమాలు మిలియ‌న్ మార్క్ క్రాస్ చేశాయి.

ఇలా వ‌ర‌స‌గా ఏ ఒక్క హీరో కూడా అటు ఓవ‌ర్సీస్‌లో మూడు సార్లు మిలియ‌న్ క్ల‌బ్‌లో, ఇటునైజాంలో ప‌ది కోట్ల‌కుపైగా వ‌సూళ్లు సాధించిన చిత్రాలు లేవ‌ట‌. ఈ రేర్ ఫీట్ సాధించిన తొలి హీరో తార‌కేన‌ట‌. దీంతో టాలీవుడ్ హిస్ట‌రీలో ఎన్టీఆర్ స‌రికొత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నాడు.


లేబుళ్లు: ,