6, ఆగస్టు 2016, శనివారం

‘బాహుబలి2’ కొత్త రిలీజ్ డేట్ !



ద‌ర్శ‌క దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన ‘బాహుబలి’ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న‘బాహుబ‌లి-2’ సినిమా మీద ఇప్ప‌టికే ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 14, 2017 విడుద‌ల చేస్తామ‌ని రాజ‌మౌళి పలు మార్లు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా, బాహుబలి 2 రిలీజ్ డేట్ మారినట్టు సమాచారమ్. ‘బాహుబ‌లి’ సినిమాని హిందిలో క‌ర‌ణ్ జోహార్ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. కరణ్ చేపట్టిన ప్రమోషన్ హిందీ బాహుబలికి బాగా కలిసొచ్చింది. ‘బాహుబ‌లి-2’ కూడా హిందీలో కరణ్ నే రిలీజ్ చేయనున్నాడు. తాజాగా బాహుబలి 2ని 28 ఏప్రిల్ 2017న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కరణ్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో బాహుబలి 2 రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే జక్కన్న ఓ ప్రకటన కూడా చేయొచ్చు.


లేబుళ్లు: