8, నవంబర్ 2016, మంగళవారం

గ్రేట్ విక్ట‌రీ..అమెరికా ప్రెసిడెంట్‌ హిల్ల‌రీనే


గ్రేట్ విక్ట‌రీ..అమెరికా ప్రెసిడెంట్‌ హిల్ల‌రీనే 

తొలిసారి అమెరికా అధ్య‌క్ష పీఠంపై మ‌హిళ ఆసీనురాలు కాబోతోంది. ప్ర‌పంచ అత్యంత ధ‌నిక ప్ర‌జాస్వామ్య దేశంలో హిల్ల‌రీ క్లింట‌న్ కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌ల‌క‌బోతున్నారు. ఆమెపై ట్రంప్ చేసిన ఆరోప‌ణలు, ఆయ‌న సృష్టించిన హంగామా అంతా ఓవ‌ర్‌నైట్‌తో తేలిపోనుంది. ప్ర‌స్తుతం అమెరికాలో జ‌రుగుతున్న పోలింగ్ మరికాసేప‌ట్లో ముగియ‌నుంది. కానీ, రీసెంట్ ట్రెండ్స్ ప్ర‌కారం.. హిల్ల‌రీనే గెలిచే చాన్స్ ఉందంటూ మీడియా చెబుతోంది.

అమెరికా అధ్య‌క్షుడిని ఎల‌క్టోర‌ల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఎల‌క్టోర‌ల్ కాలేజ్‌కి ప్ర‌జ‌లు ఓట్లు వేస్తారు. ఇలా ప్రజలు ఓట్లు వేసి గెలిపించే అమెరికా ఎలక్టోరల్ కాలేజీ అధ్యక్షుణ్ని ఎన్నుకుంటుంది. అమెరికా ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉన్నాయి. అందులో మెజారిటీ అంటే 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారని తెలిసిందే. ప్రఖ్యాత వార్తా సంస్థ సీఎన్ఎన్ తాజాగా సేకరించిన వివరాల ప్రకారం హిల్లరీ ఖాతాలో 268 ఓట్లున్నాయి. 17 రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని, మరో 5 రాష్ట్రాల్లో అనుకూలతను సంపాదించిన ఆమె.. ఊహించని పరిణామాలు తలెత్తితేతప్ప అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా గెలుపొందడం దాదాపు ఖరారయినట్లే. ఇది ఈ సోమ‌వారం చేసిన స‌ర్వే..

అయితే, మంగళవారం నాటికి అంటే.. పోలింగ్‌కు కొన్ని గంట‌ల ముందు వ్యవధిలో పరిస్థితి పూర్తిగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ప్రభంజనంలా దూసుకొస్తున్నాడ‌ని చెబుతున్నారు. మరి! సోమవారం రాత్రి నాటికి ట్రంప్ కు 204 ఎలక్టోరల్ ఓట్లు పడటం ఖాయంగా తేలింది. ఆ మేరకు 20 రాష్ట్రాల్లో గట్టి పట్టును సాధించిన రిపబ్లికన్ పార్టీ మరో 5 రాష్ట్రాల్లో అనుకూలతను సాధించింది. మంగళవారం హోరాహోరీ పోరు జరగనున్న ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ అన్నింటిలోనూ నెగ్గుకొస్తేతప్ప అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేడు.

లేబుళ్లు: