తమిళ టైగర్ల నాయకుడిగా తెలుగు హీరో
మంచు మనోజ్. రెండు ఫ్లాపులతో కాస్త డీలా పడ్డాడు. శౌర్య అండ్ ఎటాక్ సినిమాలు కెరియర్ కు మాంచి కిక్ ఇస్తాయని అనుకుంటే.. అవి రెండూ అస్సలు వర్కవుట్ కాలేదు. పోనివ్ వాటిని తీసింది ఏదో చిన్నా చితకా డైరక్టర్లు కాదు.. ఏకంగా దశరథ్ - రామ్ గోపాల్ వర్మ వంటి దిగ్గజాలు. అందుకే ఇప్పుడు చెప్పా పెట్టకుండా ఒక కత్తిలాంటి ప్రయోగం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.
సాధారణంగా మన తెలుగులో రియలిస్టిక్ సినిమాలు పెద్దగా ఆడట్లేదనే వాదన ఉంది. దానికి కారణంగా దర్శకులు కూడా ఆసక్తికరంగా చిత్రీకరించకపోవడమే. ఇప్పుడు మనోజ్ చేస్తున్న కొత్త సినిమా.. ఏకంగా శ్రీలంకను మొన్నటివరకు గడగడలాడించిన ఎల్.టి.టి.ఇ వారి జీవిత కథ ఒకటి చెప్పే సినిమా. నూతన దర్శకుడు అజయ్ ఆండ్రూస్ తీస్తున్న ఈ సినిమాలో మనోజ్ లిబరేషన్ టైగర్ల దళ నాయకుడిగా కనిపించనున్నాడు. అంతే కాదు.. ఇప్పటికే వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్కడ శ్రీలంక అడవులను.. ముఖ్యంగా జాఫ్నా ఏరియాను తలపించే కొండల్లో.. మనోళ్ళు నిజమైన గన్స్ - హెలికాప్టర్స్ - ఇతర మందుగుండి సామాగ్రి వాడి షూటింగ్ చేస్తున్నారు. అసలు వింటుంటేనే తెలుగులో ఇలాంటి సినిమాలు కూడా తీస్తున్నారా అనే ఆనందం వచ్చేస్తోంది కదూ.
మరి హిందీలో వచ్చిన ''మద్రాస్ కేఫ్'' టైపులో ఈ సినిమా కూడా సంచలనాలు ఏమన్నా క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
లేబుళ్లు: తమిళ టైగర్ల నాయకుడిగా తెలుగు హీరో

