12, సెప్టెంబర్ 2016, సోమవారం

‘జనతాగ్యారేజ్‌’లో పీవీ సింధు




ఎన్టీఆర్‌-కొరటాల శివ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘జనతాగ్యారేజ్‌’. సమంత, నిత్యామేనన్‌ కథానాయికలు. మోహన్‌లాల్‌ కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తోంది.

తాజగా ఈ చిత్రాన్ని రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు, బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌, చాముండేశ్వరినాథ్‌ వీక్షించారు. వీరికోసం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రత్యేకంగా షో ఏర్పాటు చేశారు.

అనంతరం సింధూ మాట్లాడుతూ, ”జనతా గ్యారేజ్ సినిమా ని బాగా ఎంజాయ్ చేశాను. ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కంగ్రాట్స్ టు ది హోల్ టీం” అని చెప్పారు.

గోపి చంద్ మాట్లాడుతూ.. ”మంచి కథా బలం ఉన్న సినిమా ఇది. ఎన్టీఆర్, మోహన్ లాల్ ల యాక్టింగ్ అవుట్ స్టాండింగ్. ఇంత మంచి చిత్రాన్ని అందించిన చిత్ర బృందానికి కంగ్రాట్యులేషన్స్” చెప్పారు.

లేబుళ్లు: ,