11, సెప్టెంబర్ 2016, ఆదివారం

సినిమాలకు కాజల్ గుడ్ బై ?



కాజల్ మనసు ఇప్పుడు పెళ్లి పై మళ్లినట్టు వుంది. అందుకే సమయం వొచ్చినప్పుడల్లా పెళ్లి గురించి గొప్పగా చెబుతుంది. ప్రతీ వ్యక్తికీ జీవితాంతం తోడు ఉండగలిగే ఓ భరోసా అవసరం అని.. అది పెళ్ళితోనే దొరుకుతుందని చెపుతొంది కాజల్. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కి ఇదివరకే పెళ్లయిన సంగతి తెలిసిందే. చెల్లెలు కాపురం చూస్తుంటే ముచ్చటగా ఉందని, వివాహ వ్యవస్థ పై గౌరవం కలుగుతొందని అంటోంది కాజల్. తన పెళ్ళికి చాలా సమయం ఉందన్న కాజల్.. పెళ్లాయ్యాక నటిగా కెరియర్ కొనసాగించడం కష్టమని బాంబు పేల్చింది.

కాజల్ మాట్లాడుతూ…. ” పెళ్లయ్యాక కొత్త బాధ్యతలు వస్తాయి. కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు సినిమా కావాలా ? కుటుంబం కావాలా ? అనే ప్రశ్న తలెత్తితే ఖచ్చితంగా కుటుంబమే కావాలి అంటాను. అటు సినిమాలు, ఇటు ఇల్లు చూసుకోవడం కష్టమే. అందుకే.. సినిమాలకు దూరం అవుతా. ఐతే ఈ లోగా వీలైనన్ని మంచి సినిమాల్లో నటించాలని వుంది” అని చెప్పింది ఈ చందమామ.



Tags: Kajal Agarwal, Telugu cinema news

లేబుళ్లు: ,