9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

7రోజులు.. 100కోట్లు.. ఇది గ్యారేజ్ రికార్డ్ !


Janatha Garage enters into 100cr club

“‘జనతా గ్యారేజ్’.. ఇచ్చట అన్ని రికార్డులు బ్రేక్ చేయబడును”. ఇప్పుడిదే జరుగుతోంది. జనతా గ్యారేజ్ దిమ్మతిరిగే కలెక్షన్స్ రాబడుతోంది. ఫస్ట్ షోతోనే మిక్సిడ్ టాక్ మూటగట్టుకొన్న గ్యారేజ్.. కేవలం 7రోజుల్లోనే 100కోట్లని కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే ప్రకటించడం విశేషం.

దీంతో.. ‘బాహుబ‌లి’ త‌ర్వాత అత్యంత వేగంగా 100 కోట్ల వ‌సూళ్లు సాధించిన చిత్రంగా ‘జ‌న‌తా గ్యారేజ్’ రికార్డు సృష్టించింది. గ్యారేజ్ రికార్డుల బ్రేక్ పర్వం ఇలా మొదలైంది. మొదటి మూడు రోజుల్లోనే ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. 5రోజుల్లో.. 50కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో.. చిత్రబృందం దృష్టి 100కోట్లపై పడింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే గ్యారేజ్ వంద కోట్ల క్లబ్ లో చేరడానికి మరో 15-20రోజులు పడుతుందని భావించారు.

కానీ.. గ్యారేజ్ మాయ చేసింది. కేవలం 7రోజుల్లోనే.. 100కోట్లని కొల్లగొట్టింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడు కొర‌టాల‌కు 100 కోట్ల వ‌సూళ్లలో ఇది రెండ‌వ సినిమా. మ‌హేష్ ‘శ్రీమంతుడు’తో తొలి సెంచ‌రీ న‌మోదైంది. ఇప్పుడు గ్యారేజ్ ఖాతాలోనూ 100కోట్లు పడ్డాయి. దీంతో..ఫుల్ ఖుషిగా ఉంది చిత్రబృందం.


Like this article :

లేబుళ్లు: