10, సెప్టెంబర్ 2016, శనివారం

దంచుకో ఎన్టీఆర్‌ దంచుకో..



ఓ సినిమాను మంచి టైమింగ్‌లో రిలీజ్‌ చేస్తే ఎంత లాభమో 'జనతా గ్యారేజ్‌' రుజువు చేసింది. లాంగ్‌ వీకెండ్‌కు తోడు.. వినాయకచవితి సెలవు కూడా కలిసొచ్చి.. తొలి ఐదు రోజుల్లో వసూళ్ల మోత మోగించింది 'జనతా గ్యారేజ్‌'.ఐతే రెండో వీకెండ్లో కలెక్షన్లు ఎలా ఉంటాయా అని అంతా ఆసక్తిగా చూశారు. ఢోకా ఏమీ లేదు. వసూళ్లు బాగానే ఉన్నాయి.

ఈ వారం వచ్చిన రెండు సినిమాలు 'జనతా గ్యారేజ్‌'కు అంత ప్రమాదమేమీ లేదు. విక్రమ్‌ సినిమా 'ఇంకొక్కడు'కు నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. ఆ సినిమాకు ఓపెనింగ్స్‌ పర్వాలేదు కానీ.. మరీ 'జనతా గ్యారేజ్‌'ను డ్యామేజ్‌ చేసేలా ఏమీ లేవు. ఇక 'జ్యో అచ్యుతానంద'కు పాజిటివ్‌ టాకే వచ్చింది కానీ.. బి, సి సెంటర్లలో సినిమా వీకే. అక్కడ ఆ సినిమా ఆడే అవకాశాల్లేవు. కలెక్షన్లు డల్లుగా ఉన్నాయి. అదే సమయంలో 'జనతా గ్యారేజ్‌'ను మాస్‌ ఆడియన్స్‌ బాగానే ఆదరిస్తున్నారు.

watch more @Telugu cinema news here

మొత్తంగా రెండో వీకెండ్లో 'జనతా గ్యారేజ్‌'కు మంచి వసూళ్లే వస్తాయని ఆశిస్తున్నారు. అంటే అన్ని ఏరియాల్లోనూ జనతా గ్యారేజ్ మరో వారానికి 'జనతా' ఫుల్ సేఫ్.

లేబుళ్లు: , ,