11, సెప్టెంబర్ 2016, ఆదివారం

ఎన్టీఆర్ చేతిలో మరో అడ్వాన్స్ చెక్



ఎన్టీఆర్ చేతిలో మరో అడ్వాన్స్ చెక్

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్. ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు ఎన్టీఆర్. పైగా ఒకదాన్ని మించి మరో విజయం. జనతాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ స్టామినా ఏమిటో జనతా తో పూర్తి స్థాయిలో తెలిసొచ్చింది. అందుకే ఎన్టీఆర్ తో సినిమా అంటే నిర్మాతలు ఎగబడతారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ అడ్వాన్ లు తీసుకోడు. చేతిలో రెండు సినిమాలు ఉండాల్సిందే అని అనుకోడు. ఎప్పటికి చెయ్యబోయే సినిమా లెక్కలు అప్పుడే. కానీ… ఇప్పుడు మాత్రం ఓ అడ్వాన్ చెక్ తీసుకున్నాడు. అదీ మైత్రీ మూవీస్ నుంచి. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీసిన సంస్థ ఇది. ఈ సినిమాతో బోలెడు లాభాలని మూటకట్టుకుంది. సినిమా విడుదలకు ముందే కనీసం రూ. 20 కోట్ల రూపాయలు టేబుల్ ప్రాఫిట్ కింద వొచ్చేశాయని టాక్. అందుకే ఎన్టీఆర్ తో మరో సినిమా కమిట్మెంట్ తీసుకున్నారట. దానికి సంబంధించి అడ్వాన్ కూడా ఇచ్చేశారు. సాధారణంగా అడ్వాన్స్ లు తీసుకొని ఎన్టీఆర్ మైత్రీ మూవీస్ కమిట్మెంట్ నచ్చి.. మరో సినిమా చెయ్యడానికి ఓకే అన్నాడట. ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బానర్ పై చేయనున్నాడు. ఆ తరవాత మైత్రీ తో మరోసారి జట్టుకట్టే అవకాశాలు వున్నాయి. See more @Janatha Garage 9 days Collections

లేబుళ్లు: ,