11, సెప్టెంబర్ 2016, ఆదివారం

చైతూ విలన్ … జగపతి


Jagapathi babu

జగపతి బాబు కెరియర్ ఫుల్ స్పీడ్ లో ఉందిప్పుడు. వద్దంటే సినిమాలు వొచ్చి పడిపోతున్నాయి. పారితోషికం ఎంత అడిగితె అంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ కూడా రెడీనే. కీలక పాత్రలకి జగపతి బాబు కేరాఫ్ అడ్రెస్స్ అయిపోయాడు. ప్రస్తుతం జగ్గూ భాయ్ చేతిలో 4 సినిమాలు వున్నాయి. ఇప్పుడు జగపతి ఖాతాలో మరో సినిమా వొచ్చి చేరింది. నాగ చైతన్య – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనుంది. ఈ సినిమా లో జగపతి బాబుకి ఓ కీలకమైన పాత్ర దక్కింది. అందుకోసం రూ. 60 లక్షల పారితోషికం కూడా ముట్టజెప్పారట. ఐతే జగపతిది పాజిటీవ్ పాత్రా ? లేదంటే నెగిటివ్ రోలా ? అనేది తెలియరాలేదు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. నిన్నే పెళ్ళాడతా టైపు సినిమా ఇదని ఇదివరకే నాగ్ హింట్ ఇచ్చేశాడు. మరి చైతూ కెరియర్ కి ఎంత వరకూ ప్లస్ అవుతుందో చూడాలి.

లేబుళ్లు: ,