మహేష్ మంచి నిర్ణయం
మహేష్ బాబు- మురగదాస్ కలయికలో ఓ భారీ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబధించిన లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే..ఈ సినిమా తమిళ వెర్షన్ కి మహేశ్ బాబుతో డబ్బింగ్ చెప్పించాలని మురుగదాస్ నిర్ణయించుకున్నాడట.
మహేశ్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ .. ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు తమిళంలో రిలీజ్ అయినప్పుడు, అక్కడి డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించిన సంగతి తెలిసిందే.
చెన్నై లో పుట్టి పెరగిన మహేష్ చాలా చక్కగా తమిళంలో మాట్లాడగలడు, సో.. ఇప్పడు మురగదాస్ తీసుకున్న నిర్ణయం మంచిదనే చెప్పాలి.
ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా రకుల్ నటిస్తోంది. హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.
లేబుళ్లు: Mahesh Babu, Telugu news


<< హోమ్