12, సెప్టెంబర్ 2016, సోమవారం

నాయ‌కీ, అభినేత్రి ఒక్క‌టేనా?



హార‌ర్ ద్రిల్లర్ల జాబితాలో మ‌రో సినిమా వ‌స్తోంది… అదే అభినేత్రి. ప్ర‌భుదేవా క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి విజ‌య్ దర్శకుడు. అభినేత్రికి సంబంధించి రెండు టీజ‌ర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఒక‌దాంట్లో ప్ర‌భుదేవా క్లాసీ స్టెప్పులతో అద‌ర‌గొడితే మ‌రో టీజ‌ర్‌లో త‌మ‌న్నా రెచ్చిపోయి చిందులేసింది. ఈ రెండు టీజర్లతో ఈసినిమాకి కావ‌ల్సినంత హైప్ వ‌చ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ట్రైలర్ చూస్తుంటే క‌థ చూచాయిగా తెలిసిపోతోంది. క‌థానాయిక కావాల‌నుకొని ప‌ల్లెటూరు నుంచి ప‌ట్నం వ‌చ్చిన త‌మ‌న్నా… సోనూసూద్ చేతిలో మోస‌పోయి ఆత్మహత్య చేసుకొంటుంది. త‌నే దెయ్యంలా మారి ప‌గ తీర్చుకొంటుంది, అదెలా అన్న‌ది తెర‌పై చూడాలి. బేసిక్ ఫ్లాట్ వింటుంటే.. ఇది వ‌ర‌కు వ‌చ్చిన నాయ‌కి సినిమా గుర్తొస్తోంది. త్రిష క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమా కథ కూడా ఇంచుమించు ఒక‌టే. నాయ‌కి, అభినేత్రి.. ఇలా పేర్లు కూడా క‌ల‌సిపోయాయి. మ‌రి.. ఈ రెండు క‌థ‌లూ దాదాపుగా ఒకేలా ఉన్నా… టేకింగ్ ప‌రంగా తేడాలు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. అభినేత్రి చాలా లావీష్‌గా క‌నిపిస్తోంది. ప్ర‌భుదేవా ఎప్పుడూ చేయ‌ని డిఫ‌రెంట్ రోల్‌లో క‌నిపిస్తున్నాడు. ట్రైలర్ కూడా నీట్‌గానే క‌త్తిరించారు. మూడు భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కించ‌డం వ‌ల్ల‌, మూడు చోట్లా త‌మ‌న్నా తెలిసి ఉండ‌డం వ‌ల్ల‌.. బడ్జెట్ ప‌రంగా, మార్కెట్ ప‌రంగా వెసులుబాటు దొరుకుతుంది. త‌మ‌న్నా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సూపర్బ్ గా ఉంది. టోట‌ల్‌గా.. అభినేత్రిలో హిట్టు కొట్టే లక్షణాలు పుష్కలంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి… ఈ అంచ‌నాల్ని అందుకొంటుందో లేదో చూడాలి.

లేబుళ్లు: