11, సెప్టెంబర్ 2016, ఆదివారం

వెంకటేశ్ – నాగార్జున ఒకే చిత్రంలో కనిపించబోతున్నారు.



వెంకటేష్ , నాగార్జున వెండి తెర ఫై ఇద్దరు హీరోలే..తెర వెనుక ఇద్దరు బాగా దగ్గరివారన్న సంగతి తెలిసిందే..వరుసకు ఇద్దరు చుట్టాలే అయినప్పటికీ ఇద్దరు కలవడం మాత్రం చాల రేర్..అలాంటిది ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే చిత్రంలో కనిపించబోతున్నారనే వార్త ఇద్దరి అభిమానులను తెగ ఊరిస్తుంది..ఇంతకీ వీరిద్దరూ ఏ చిత్రం లో కనిపించబోతున్నారనే కదా మీ సందేహం..అక్కడికి వస్తున్నాం..

నాగచైతన్య , శృతి హాసన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో ‘ప్రేమమ్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే..ఈ నెల 20 న చిత్ర ఆడియో వేడుకలను జరుపుకోబోతుంది..ఇక ఈ సినిమాలో వెంకటేశ్, నాగార్జున ఇద్దరూ అతిథులుగా కనిపించబోతున్నారు. నాగ్ సినిమా చివర్లో కనిపించగా , వెంకీ ఇంటర్వెల్ లో కనిపిస్తారని సమాచారం. కొత్తకాలంగా నాగచైతన్య సరైన హిట్ లేకపోవడం తో నాగ్ , ప్రేమమ్ తో నాగచైతన్య హిట్ రావాలని మంచి కసిగా ఉన్నాడు..అందుకే ఈ చిత్రం లో గెస్ట్ రోల్ లో నటించడానికి సై అన్నాడు. వెంకీ కూడా సేమ్ అలాగే ఉన్నాడు. మరి ఈ ఇద్దరు కలిసి నాగచైతన్య ఎలాంటి హిట్ ఇస్తారో చూడాలి. దసరా కానుకగా ఈ చిత్రం వచ్చే నెల 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


లేబుళ్లు: ,