క్లైమాక్స్ సీన్స్ జతచేశారు..!
తారక్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా టాలీవుడ్ లో చాలా మంచి విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రుల మధ్య థ్యాంక్స్ టు మీట్ ను ఏర్పాటు చేసుకుంది జనతా గ్యారేజ్ యూనిట్.ఇలాంటి విజయన్ని అందించినందుకుగాను జూనియర్ ప్రతిఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలను తెలుపుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో మరో రెండు సీన్స్ ను జత చేయడం జరిగిందని, క్లైమాక్స్ లో వచ్చే ఈ సన్నివేషాల్లో యంగ్ టైగర్ చాలా అద్భుతంగా చేశాడని, ఈరోజు నుంచే ధియేటర్స్ లో ఆ సీన్స్ ను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు.
ఇక మరోపక్క ‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ సక్సెస్ లతో మంచి ఊపు మీదున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, తదుపరి చిత్రం ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తనకు ‘టెంపర్’ ఇచ్చిన పూరీతో తారక్ జతకట్టబోతున్నాడని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ, ఏది అధికారికంగా వెల్లడికాలేదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ వార్త ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న “ఇజం” సినిమాలో తారక్ ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ ఊపందుకుంది. కధకు అనుగుణంగా ఓ అతిథి పాత్ర ఉండడంతో, తారక్ ను సంప్రదించిన చిత్ర యూనిట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది ఈ వార్త సారాంశం. దర్శకుడు పూరీతో ఉన్న సాన్నిహిత్యం మరియు తన సోదరుడు సినిమా కావడం వలనే దీనికి అంగీకారం తెలిపారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
లేబుళ్లు: Janatha Garage Climax, Telugu news


<< హోమ్