నాని నేను లోకల్ లో ఎన్టీఆర్?
ఈ మధ్య కాలంలో ఓ హీరో క్రేజ్ ను మరో హీరో సినిమా కోసం వాడుకుంటుడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతలా అంటే భాష భేదం లేకుండా ఫ్రెండ్లీ మ్యానర్ లో వేరే భాషల చిత్రాల్లో కొమియోలు చేయటం చూస్తుంటాం. తన గొంతును అరువిచ్చే విషయంలో మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు.
తనకు దగ్గరివాళ్లైన చిత్రాలకు వాయిస్ ఓవర్ ఓవర్, అవసరమైతే ఓ అడుగు ముందుకు వేసి ప్రమోట్ చేయటం చాలా సందర్భాల్లో చూశాం. ఆ మధ్యయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చక్రవ్యూహలో ఏకంగా ఓ సాంగే ఏస్కున్నాడు. సినిమా మంచి సక్సెస్ అవటం ఒక ఎత్తు అయితే, ఎన్టీఆర్ పాడిన ఆ పాట పిచ్చ పాపులర్ కావటం ఇంకోఎత్తు. ఈ సెంటిమెంట్ తో ఈసారి తెలుగులో ఫస్ట్ టైం మరోహీరో కోసం తారక్ గొంతు వాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎన్టీఆర్ పాట పాడబోయేది ఎవరి కోసమో కాదు నేచురల్ స్టార్ నాని కోసం..
సినిమా చూపిస్త మావ దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ జంటగా నేను లోకల్ చిత్రం తెరకెక్కబోతుంది. దిల్ రాజు నిర్మాతకాగా, దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక ఈ చిత్రం కోసం ఓ పాట పాడాల్సిందిగా ఎన్టీఆర్ కి కబురు వెళ్లిందట. అడిగింది దేవీ కావటంతో మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ పాట రికార్డు చేసేందుకు సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయని సమాచారం. అదే జరిగితే నేను లోకల్ కి ఎక్స్ ట్రా క్రేజ్ వచ్చేయటం ఖాయమనే చెప్పుకోవచ్చు. అన్నట్లు గతంలో కృష్ణగాడి వీర ప్రేమగాథ కోసం నాని బాలయ్య బాబును వాడుకున్న
లేబుళ్లు: NTR to sing For Nani


<< హోమ్