కీర్తి సురేష్ కాస్త ‘లోకల్’ అయ్యిపోయింది.
‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు లో పరిచయం అయినా కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించింది. తమిళం లో వరుస చిత్రాలతో బిజీ గా ఉండడం వల్ల మొదటి చిత్రం తర్వాత అవకాశాలు వచ్చిన వాటిని సైన్ చేయడానికి కుదరలేదు. కాస్త గ్యాప్ ఇచ్చి మల్లి తెలుగు లో నాని సరసన ‘నేను లోకల్ ‘ అంటూ తెలుగు ఆడియన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యింది.
వరుస హిట్ చిత్రాలతో తన మార్కెట్ ను పెంచుకోవడమే కాదు అగ్ర హీరోల సరసన చేరిపోయాడు నాని. ప్రస్తుతం ఇతడి కాల్ షీట్స్ కోసం పెద్ద డైరెక్టర్స్ సైతం వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ‘సినిమా చూపిస్త మామ’ ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ‘నేను లోకల్ ‘ గా రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్య క్రమాలు రేపు జరగనున్నాయి.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్ టెయినర్ గా తెరకెక్కనుంది.
లేబుళ్లు: Nani romance with keerthi suresh


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్