ఆరుగురు హీరోయిన్స్ తో రోమాన్స్ చేస్తున్న వెంకటేష్
నేను శైలజ” డైరక్టర్ కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేయబోతున్నాడు వెంకటేష్. ఈ సినిమాకు పేరు కూడా పెట్టేశారట. ”ఆడాళ్ళు మీకు జోహార్లు” అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది. ఇదివరకు వెంకటేష్ నటించిన ‘ఆడవారిమాటలకు అర్థాలే వేరులే’, ‘మల్లీశ్వరి’, ‘నువ్వునాకునచ్చావ్’ తరహాలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం వుండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇప్పుడీ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటీ ఈ సినిమా మొత్తం ఆరుగురు హీరోయిన్స్ కనిపిస్తారట. మెయిన్ హీరోయిన్ ఒక్కరే గాని.. కొన్నిస్పెషల్ సీన్లలో గెస్ట్ అప్పిరియన్స్ గా హీరోయిన్ల అవసరం ఉటుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి కోసం అన్వేషణ చేస్తోంది చిత్ర యూనిట్.
ఆరుగురు హీరోయిన్స్ అంటే వెంకటేష్ ప్రేమతో రా సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమాలో కూడా సిమ్రాన్ లీడ్ హీరోయిన్ కాని మరి కొందరు గెస్ట్ అప్పిరియన్స్ లో కనిపించారు. ఇప్పుడు మరోసారి వెంకీ సినిమాలో గ్లామరసం పండబోతుందన్నమాట.
లేబుళ్లు: venkatesh romance of with six heroines


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్